సిపిఐ ఎంఎల్ ( మాస్ లైన్)
నేటి వారధి తెలుగు పత్రిక ప్రతినిధి
ఖమ్మం:అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ ఇరాన్‌పై
అమెరికా ఇజ్రాయిల్ చేస్తున్న దాడులతో మన దేశానికి తీవ్రమైన ఇంధన సంక్షోభం తప్పదని సిపిఐ ఎంఎల్ (మాస్ లైన్) ఖమ్మం జిల్లా కార్య దర్శి వర్గ సభ్యులు జి. రామయ్య అన్నారు ఈరోజు పార్టీ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఖమ్మం బైపాస్ రోడ్ లో పార్టీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించి అమెరికా యుద్ధం న్మొమాది ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది
అనంతరంజి .రామయ్య పాల్గొని మాట్లాడు తూ గల్ఫ్ దేశంలో ఆయిల్ పై ఆధిపత్యం కోసం అమెరికా చేస్తున్నానరమేధాన్ని ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని యుద్ధం ఇలానే కొనసాగితే భారతదేశంలో చమురు సంక్షోభం కూడా ఏర్పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ప్రపంచంలో యుద్ధాలు చేసి నా ఏ దేశం బాగుపడలేదని యుద్ధము వల్ల విధ్వంసం సృష్టిస్తారు తప్ప మరొకటి మిగలదని ఇప్పటికైనా అమెరికా చేస్తున్నటువంటి యుద్ధాన్ని వెంటనే ఆపాలని ఈ యుద్ధాన్ని భారతదేశం కూడా ఖండించాలని వారు అన్నారు.ఈ కార్యక్రమం లో సిపిఐ ఎంఎల్ (మాస్ లైన్) ఖమ్మం డివిజన్ కార్యదర్శి ఝాన్సీ పార్టీ నగర కార్యదర్శి శోభ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ శిరోమణి కే శ్రీనివాస్ మరియు నగర నాయకులు జె లెనిన్ చందు బజారు నన్నే శ్రీను తిరపయ్య దాసు సైదులు రామరాజు రవి తదితరులు పాల్గొన్నారు

