Friday, April 3, 2026

విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా జిల్లా వ్యాప్తంగా గ్రామాలలో అవగాహన కార్యక్రమం.

- Advertisment -

నేటి వారధి తెలుగు పత్రిక ప్రతినిధి
తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాన్ని పోలీస్ అధికారులు సందర్శించి యువతకు మరియు గ్రామ పెద్దలకు రోడ్డు భద్రత నియమాలు, సైబర్ నేరాలు, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే హానికర ప్రభావాలు మరియు వాటి పరిణామాల గురించి వివరంగా అవగాహన కల్పించారు.అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునే Shakti App ప్రాముఖ్యత, Dial 112 అత్యవసర సేవల వినియోగంపై కూడా ప్రజలకు తెలియజేశారు.
గ్రామస్తులు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు ,లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ప్రజల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని అధికారులు తెలిపారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -