నేటి వారధి తెలుగు దినపత్రిక ప్రతినిధి
ఖమ్మం:సారధి నగర్ లోని శ్రీరామ మందిరం వద్ద నిర్వహిస్తున్న వ వార్షికోత్సవం లో భాగంగా శ్రీ సీతారాముల కల్యాణానికి 46వ డివిజన్ కార్పొరేటర్ కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ దంపతులు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మంగళ వాయిద్యాలతో మహిళలందరూ సామూహికంగా సీతారాముల మీద అమితమైన భక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కళ్యాణానికి సంబంధించి సామాగ్రిని వెంట తీసుకొని వెళ్లారు. తలంబ్రాలు తీసుకొని వెళ్తుంటే మహిళలు వారి ఇళ్ళ ముందు స్వాగతం పలికారు. అనంతరం కళ్యాణోత్సవంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నడిపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సింగం అంజయ్య, వంగాల వెంకటేశ్వర్లు, చేతి కృష్ణ, వేల్పుల రమణ, తొగరు భాస్కర్, కన్నం రమేష్, బాల్దే నాగేశ్వరరావు, శనిగరం ఉప్పలయ్య, జెట్ట కృష్ణయ్య, దయ్యాల నాగేశ్వరరావు, చుంచు వెంకటేశ్వర్లు, దాచేపల్లి మల్లయ్య, ఎరకనబోయిన వెంకటేశ్వర్లు మంగ యాదయ్య, బాలం బిక్షం, ఎమ్మే రామకృష్ణ, గోనెల రవిశంకర్, తవిడ బోయిన శ్రీనివాస్, బుంగ శ్రీనివాస్, చిందం సైదులు తదితరులు పాల్గొన్నారు
శ్రీ సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించిన కార్పోరేటర్ కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ దంపతులు
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

