Tuesday, June 2, 2026

ప్రధాని మోదీతో మార్కో రుబియో భేటీ..

- Advertisment -

భారత్-అమెరికా సంబంధాలపై కీలక చర్చలు

నేటి వారధి న్యూస్ ప్రతినిధి
ఢిల్లీ నేషనల్ : అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో భారత్ పర్యటన తొలి రోజే ప్రధాని నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించారు దాదాపు గంటకు పైగా సాగిన ఈ భేటీలో కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, రక్షణ, వాణిజ్యం, ఇండో-పసిఫిక్ భద్రత అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం.రుబియో ముందుగా కోల్‌కతాకు చేరుకుని మథర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ప్రధాన కేంద్రాన్ని సందర్శించారు.అనంతరం ఢిల్లీకి చేరుకుని ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.
రుబియో భారత పర్యటనలో ముఖ్యంగా క్వాడ్ భాగస్వామ్యం, చైనా ప్రభావం, సరఫరా గొలుసులు, రక్షణ సహకారం, ఇంధన భద్రత వంటి అంశాలు ప్రధాన చర్చగా మారాయి.భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన లక్ష్యంగా విశ్లేషకులు భావిస్తున్నారు.ఇరు దేశాల మధ్య భద్రత, వాణిజ్యం, కీలక సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించడంపై ప్రధాని మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి రుబియో మధ్య చర్చలు జరిగినట్టు భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు.అలాగే స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్‌ను ముందుకు నడిపించే మార్గాలపై కూడా ఇరువురి మధ్య ఫలవంతమైన చర్చలు జరిగినట్టు తెలిపారు..

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -