నేటి వారధి న్యూస్ ప్రతినిధి
ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ కు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి ని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ స్వాగతం పలికారు.
అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు కవాతు నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అడిషనల్ డీసీపీ అడ్మిన్
రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం పోలీస్ కమీషనర్ కార్యాలయంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) రామానుజం, పోలీస్ హెడ్ క్వాటర్స్ లో అడిషనల్ డీసీపీ కుమారస్వామి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు పోలీస్, హోంగార్డు, మినిస్ట్రీయల్ స్టాఫ్ సిబ్బందికి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు
పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

