Saturday, August 1, 2026

పాఠశాలలలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

- Advertisment -

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

నేటి వారధి న్యూస్ ప్రతినిధి, మంచిర్యాల జిల్లా:ప్రభుత్వ పాఠశాలలలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శనివారం జిల్లాలోని లక్షెట్టిపేట మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి భోజనశాల, అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యా సంస్థలను బలోపేతం చేస్తూ విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలలో త్రాగునీరు, విద్యుత్, ప్రహరీ గోడ, మూత్రశాలలు ఇతర పూర్తి సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలలో విద్యార్థినీ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం అందించడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -