జూన్ 15న బచ్చోడులొ జరిగే AIKMS మండల మహాసభ ను జయప్రదం చేయండిAIKMS జిల్లా నాయకులు గొర్రెపాటి వీరస్వామి
నేటి వారధి న్యూస్ ప్రతినిధి
రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పోరాటం చేస్తున్న అఖిల భారత రైతు కూలి సంఘం జాతీయ మహాసభలు సెప్టెంబర్ 28,29,30 తేదీలలో ఖమ్మంలో నిర్వహించబోతున్నామని ఆ సందర్భంగా గ్రామ గ్రామాన విస్తృతంగా ప్రచారం చేస్తూ మండల మహాసభలు జరుపుకుంటున్నామని అందులో భాగంగానే జూన్ 15వ తారీఖు నాడు అఖిల భారత రైతు కూలి సంఘం తిరుమలాయపాలెం మండల మహాసభను బచ్చోడు గ్రామంలో నిర్వహిస్తున్నామని ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు గొర్రెపాటి వీరస్వామి అన్నారు గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేస్తూ 15వ తారీఖు నాడు జరిగే మహాసభను సభలో భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకోవడం కొరకు, రైతాంగ ఉద్యమాలను బలోపేతం చేయటం కొరకు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అనేక తీర్మానాలు చేసుకొని రానున్న రోజుల్లో సమరశీల పోరాటాలు నిర్వహించడం కోసం కర్తవ్యాలను రూపొందిస్తామని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు బింగి శ్రీను, నగేష్ వెంకన్న,సంజీవ, బిక్షం తదితరులు పాల్గొన్నారు.

