నేటి వారధి న్యూస్ ప్రతినిధి
ఖమ్మం:శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకుడికి ఐ ఐ టీ మద్రాస్ – NPTEL-SWAYAM అవార్డు..
స్థానిక పొన్నేకల్‌లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ECE) విభాగానికి చెందిన సీనియర్ అధ్యాపకులు శ్రీ డి. హతిరామ్ ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న NPTEL-SWAYAM కార్యక్రమం ద్వారా ప్రతిష్ఠాత్మకమైన Motivated Learner Award – 2026ను అందుకున్నారు. అధ్యాపక వృత్తిలో కొనసాగుతూ నూతన సాంకేతిక పరిజ్ఞానాలు, కృత్రిమ మేధస్సు (AI), డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లోని ఆధునిక అంశాలపై నిరంతరం అధ్యయనం చేస్తూ అనేక NPTEL ఆన్‌లైన్ కోర్సులను విజయవంతంగా పూర్తి చేసినందుకు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఐఐటీలు మరియు దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల అధ్యాపకులతో పోటీపడి ఈ అవార్డు సాధించడం విశేషం.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె. లక్ష్మి నారాయణ గారు మాట్లాడుతూ, నాణ్యమైన విద్య అందించాలంటే అధ్యాపకులు నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. శ్రీ హతిరామ్ గారు సాధించిన ఈ గుర్తింపు కళాశాల అధ్యాపక బృందం ప్రతిభకు నిదర్శనం. విద్యార్థులకు సాంకేతికంగా మరింత మెరుగైన బోధన అందించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది” అని అన్నారు.కళాశాల చైర్మన్ శ్రీ మల్లెంపాటి శ్రీధర్ గారు మాట్లాడుతూ, “దేశంలో అత్యున్నత సాంకేతిక విద్యా సంస్థలలో ఒకటైన ఐఐటీ మద్రాస్ నుంచి ఈ అవార్డు అందుకోవడం కళాశాలకు ప్రత్యేక గౌరవం. అధ్యాపకులు నిరంతరం జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని” సూచించారు.
కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సాయి గీతిక గారు మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగం వేగంగా మారుతున్న నేపథ్యంలో అధ్యాపకులు కూడా ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి అని NPTEL-SWAYAM వంటి కార్యక్రమాలు అధ్యాపకులకు ప్రపంచస్థాయి విద్యను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఈ అవార్డు కళాశాలలోని ఇతర అధ్యాపకులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అని పేర్కొన్నారు.
కళాశాల డైరెక్టర్ శ్రీ విద్య గారు మాట్లాడుతూ, నిరంతర అధ్యయనం, పరిశోధన మరియు సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి కలిగిన అధ్యాపకులు మాత్రమే విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చగలరు ఈ ఘనత కళాశాల విద్యా ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది అని తెలిపారు.
కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కళాశాల డీన్ డాక్టర్ వి సుదర్శన్,అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వైశాలి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్, డిప్లొమా ఇంచార్జి కృష్ణ ప్రసాద్ మరియు వివిధ విభాగాల అధిపతులు డాక్టర్ చార్యులు , డాక్టర్ ప్రణతి,డాక్టర్ జ్యోతి,సురేష్ పాల్గొన్నారు.
చైతన్య ఇంజనీర్ కళాశాల అధ్యాపకుడికి ఐఐటి అవార్డు
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

