.
నేటి వారధి న్యూస్ ప్రతినిధి
మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం ఉప్పరిగూడెం గ్రామంలో మధ్యాహ్న భోజన కార్మికురాలు నాగంటీ మంగమ్మ చేపట్టిన నిరసనకు మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అండగా నిలిచారు. మంగమ్మ ధర్నా చేపట్టిన విషయం తెలుసుకున్న గంట వ్యవధిలోనే స్పందించిన ఆయన గ్రామానికి చేరుకుని బాధితురాలిని పరామర్శించారు.ఈ సందర్భంగా మంగమ్మ ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, ఆమెకు పూర్తి మద్దతు ఉంటుందని భరోసా కల్పించారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నాలుగు రోజులు ఓపిక పట్టాలి. నేను ఉన్నాను. మీ సమస్యలన్నీ నా దృష్టిలో ఉన్నాయి. నేను అన్నీ వింటున్నాను. ధైర్యంగా ఉండండి, వచ్చేది మన ప్రభుత్వమే అని అన్నారు.అలాగే మంగమ్మ వద్ద సెల్‌ఫోన్ లేకపోవడం గమనించిన ఆయన వెంటనే సెల్‌ఫోన్ కొనుగోలుకు అవసరమైన నగదును అందజేసి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.మంగమ్మకు జరిగిన అన్యాయంపై వెంటనే స్పందించి ఆమెకు అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ తీరుపై పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఆయన స్పందనతో కార్యకర్తలకు ధైర్యం కలిగిందని స్థానిక నాయకులు అభిప్రాయపడ్డారు

