నేటి వారధి న్యూస్ ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చింత్రియాల గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఉషారాణి చేపట్టిన వినూత్న విధానం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది, గ్రామంలో విచ్చలవిడిగా పెరుగుతున్న బెల్ట్ షాపులను నియంత్రించేందుకు అవలంబిస్తున్న కొత్త పద్ధతితో గ్రామంలో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు, పల్లెటూరు నుండి పట్టణం వరకు ఎక్కడ చూసినా బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి, పాన్ షాప్ మొదలుకొని కిరాణా షాపు వరకు మద్యం దొరకని చోటు అంటూ లేకుండా పోయింది, కిరాణా షాపుల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తుండడంతో స్థానిక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుడడంతో చింత్రియాల సర్పంచ్ బెల్టుషాపుల నియంత్రణకు నడుం బిగించారు, చింత్రియాల గ్రామ పంచాయతీలోనీ కట్టంవారిగూడెంలో విచ్చల విడిగా బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు చేస్తుండడంతో గ్రామ పెద్దలు, పంచాయతీ సభ్యులతో చర్చించి ఒకే బెల్ట్ షాప్ నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు, బెల్ట్ షాప్ కోసం వేలం పాట నిర్వహించి అధిక మొత్తం చెల్లించిన వ్యక్తికి ఏడాది పాటు మద్యం విక్రయాల బాధ్యత అప్పగించేలా తీర్మానం చేశారు, ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నామని సర్పంచ్ ఉషారాణి చెప్తున్నారు, అయితే ఈ విధానం కొంత వివాదాస్పదంగా ఉన్న గ్రామాలలో విచ్చల విడిగా సాగుతున్న అక్రమ మద్యం విక్రయాలను నియంత్రించాలనే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..
బెల్ట్ షాపుల నియంత్రణకు సర్పంచ్ వినూత్న ప్రయోగం, వేలం పాట ద్వారా ఒకే షాప్ ఎంపిక, వచ్చిన ఆదాయంతో గుడి, బడి అభివృద్ధి..
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

