చేతల మనిషే కందాళ”పాటకు విశేష ఆదరణ
కందాళ సేవలను కీర్తించిన ప్రజా కవి నాగయ్య
నేటి వారధి న్యూస్ ప్రతినిధి
ఖమ్మం జిల్లా: కూసుమంచి మండలం రాజుపేట గ్రామానికి చెందిన ప్రజా కవి, రచయిత సబ్బు నాగయ్య మరోసారి తన కలం పదునును చాటారు. ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సేవలను కీర్తిస్తూ ఆయన రచించిన మాటల మనిషి కాదు కందాళ.. చేతల మనిషే కదా కందాళ” అనే ప్రత్యేక గీతం ఇటీవల యూట్యూబ్లో విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ప్రజా జీవితంలో మాటల కంటే చేతలకే ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడిగా కందాళ ఉపేందర్ రెడ్డి పేరు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిందని, ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమానికి చేసిన కృషి, నియోజకవర్గ ప్రజలతో ఆయనకున్న ఆత్మీయ అను బంధాన్ని ఈ పాటలో హృద్యంగా ఆవిష్కరించినట్లు రచ యిత సబ్బు నాగయ్య తెలిపారు. రాజకీయ నాయకులపై పాటలు రాయడం సాధారణ విషయమే అయినప్పటికీ, ప్రజల మనోభావాలను ప్రతిబింబిస్తూ నాయకుడి సేవలను సాహిత్య రూపంలో ప్రజలకు చేరవేయడం ఒక సామాజిక బాధ్యతగా భావించి ఈ పాటను రచించినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామీణ జీవన విధానం, ప్రజల ఆకాంక్షలు, అభివృద్ధిపై ఉన్న ఆశయాలను ఈ గీతంలో ప్రతిబింబించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ఈ పాటకు వంగూరి గంగాధర్ రావు ఎడిటింగ్ నిర్వహించగా సాహిత్యాన్ని ప్రజా కవి సబ్బు నాగయ్య అందించారు. సంగీతం, సాహిత్యం, వీడియో రూపకల్పన సమన్వ యంతో రూపొందిన ఈ గీతం ప్రేక్షకులను ఆకట్టు కుంటోంది. యూట్యూబ్ వేదికగా విడుదలైన అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, కందాళ ఉపేందర్ రెడ్డి అభిమానులు పాటను అభినం దిస్తూ సోషల్ మీడియా వేదికల ద్వారా తమ స్పందన తెలియజేస్తున్నారు. తెలంగాణ ప్రాంతీయ సంస్కృతి, భాషా మాధుర్యం, స్థానిక ప్రజల భావోద్వేగాలను ప్రతి బింబించేలా రచించిన ఈ గీతం గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది. ప్రజా కవి సబ్బు నాగయ్య గతంలో కూడా పలు సామాజిక, సాంస్కృతిక అంశాలపై రచనలు చేసి మంచి గుర్తింపు పొందారు. తన రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించడంతో పాటు సమాజానికి ఉపయోగపడే అంశాలను వెలుగు లోకి తీసుకురావడం ఆయన ప్రత్యేకతగా స్థానికులు పేర్కొంటున్నారు. రాజుపేట గ్రామానికి చెందిన సబ్బు నాగయ్య రచించిన ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో కూడా విస్తృతంగా ప్రచారం పొందుతోంది. ప్రజా నాయకత్వం, అభివృద్ధి, సేవా భావం వంటి అంశాలను ప్రధానంగా తీసుకుని రూపొందించిన ఈ గీతం భవిష్యత్తులో మరింత మంది ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశముందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

