నేటి వారధి ప్రతినిధి
మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విద్యావంతుడై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న యువకుడు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడటం స్థానికులను ఆందోళనకు గురిచేసింది. ప్రశాంతంగా ఉండే గిరిజన ప్రాంతాలకు కూడా గంజాయి మహమ్మారి విస్తరిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యువత పెడదోవ పట్టకుండా అక్రమ మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం తిరుమలగండి గ్రామ పరిధిలోని పుట్టలభూపతి తండాకు చెందిన మాలోత్ కళ్యాణ్ (23) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఖానాపురం మండలం అశోక్‌నగర్ గ్రామంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో అతడు అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అతని వద్ద నుంచి 2.038 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.1,01,900 ఉంటుందని పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్లు వెల్లడించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, గంజాయి సరఫరా వెనుక ఉన్న ముఠా, ఇతర నిందితుల వివరాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
గంజాయి రవాణాలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్. ఏజెన్సీ ప్రాంతంలో కలకలం
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

