నేటి వారధి (ప్రతినిధి)
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఒడిశా సరిహద్దు నుంచి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని పాతపట్నం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కిల్లి వెంకటరావు ఆదేశించారు. పాతపట్నం అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు, విధుల నిర్వహణ, రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఒడిశా వైపు నుంచి గంజాయి, నాటుసారా, మద్యం తదితర అక్రమ వస్తువుల రవాణా జరగకుండా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని, తనిఖీల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వొద్దని సూచించారు.రోడ్డు భద్రతా నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని సీఐ పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడంతో పాటు వాహనానికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. ఈ తనిఖీలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
సరిహద్దులో అక్రమ రవాణాపై ఉక్కు పాదం..చెక్‌పోస్ట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఐ
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

