నేటి వారధి (ప్రతినిధి)
ఖమ్మం కవి, రచయిత, కళాకారుడు, ఉద్యమ నేత కోమాకుల సీతారాములు రచించిన “హాస్టల్ కతలు ” పుస్తకావిష్కరణ కార్యక్రమం జులై నెల 26 న ఉదయం, 10. గంటలకు నిర్వహిస్తున్నట్లు బహుజన సాహిత్య వేదిక ప్రకటించింది.హాస్టల్ కథలు పుస్తకావిష్కరణ కార్యక్రమం బ్రోచర్‌ను భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆవిష్కరించారుభక్త రామదాసు కళా క్షేత్రం, ఖమ్మం లో నిర్వహిచే ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి, రచయిత, ఎ. విద్యా సాగర్, ఐ.ఎ.ఎస్., మరో రచయిత భంగ్య భూక్య హాజరు కానున్నారని తెలిపారు. కాళోజి అవార్డు గ్రహీత ప్రముఖ కవి, రచయిత ఆర్. సీతారాం అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమం లో ప్రసిద్ధ సినీ సంగీత దర్శకులు, గాయకులు, గద్దర్ అవార్డు గ్రహీత భీమ్స్ సిసిరోలియో ను ఘనంగా సన్మానించనున్నారుఇంకా ఈ కార్యక్రమం లో ప్రముఖ కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు ప్రసేన్, గేజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాస రావు, కవి, రచయిత అమ్మిన శ్రీనివాస రాజు పాల్గొనబోతున్నట్లు తెలిపారు.మొగిలి వెంకటేశ్వర్లు సమన్వయ కర్త గా వ్యవహరించే ఈ కార్యక్రమం లో కవి, రచయిత, రాచమళ్ళ ఉపేందర్ పుస్తక సమీక్ష చేయనున్నారు.
అనేక సాహితీ సంఘాల, ఉద్యగ సంఘాల రాష్ట్ర, జిల్లా బాధ్యులు పాల్గొనే ఈ కార్యక్రమంలో కోమాకుల సీతారాములు దంపతుల సప్తతి ని కూడా నిర్వహించనున్నట్లు బహుజన సాహిత్య వేదిక బాధ్యులు సయ్యద్ ఖుర్షీద్, మద్దెర్ల రమేష్, కోమిరే వెంకన్న, పమ్మి రవి, మావూరి మల్లేశం, బి. ఎల్. వెంకన్న, వజ్రం నాగేశ్వర్ రావు, పంజాల ఐలయ్య పాల్గొన్నారు
ఈ కార్యక్రమం లో ఉద్యోగ, ఉపాధ్యాయ, సాహితీ సంఘాల బాధ్యులు, ఆ లోచనా పరులు, రచయిత లు, కవులు, మేధావులు పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.
26 న హాస్టల్ కథలపుస్తకావిష్కరణ సభ
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

