నేటి వారధి న్యూస్ ప్రతినిధి
ఖమ్మం :ఖమ్మంలో గల స్థానిక కవితా మెమోరియల్ డిగ్రీ కళాశాలలో యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఖమ్మం వారి ఆధ్వర్యంలో యోగా వేసవి శిక్షణా శిబిరం ముగిసింది. ఈ శిక్షణ శిబిరంలో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. యోగా చేయటం వల్ల ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తి పెరుగుతుంది, శరీరం చురుకుగా ఫ్లెక్సిబుల్ గా తయారవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది శారీరిక మానసిక ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది, క్రమశిక్షణ పెంపొందును, మరియు శారీరక మానసిక దృఢత్వం పెరుగుతుందని ముగింపు కార్యక్రమంలో ఈ యొక్క శిబిరానికి డైరెక్టర్స్ అయిన శ్రీ యందవ రమేష్ (యోగాసన నేషనల్ జడ్జ్, నేషనల్ కోచ్) తెలియజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీ ఎస్ కోదండరావు (యోగ మాస్టర్ 14 సం.ల అనుభవం), కన్వీనర్ శ్రీ కమర్తపు గోపాల్ రావు జిల్లా యోగాసనం స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఖమ్మం, కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీ కోట అప్పిరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వి.రమణారావు, కే సీతారాములు ఇ.కిషోర్, ఎం.కోటేశ్వరరావు, ఎం సృజన, కె జ్యోతి, కల్పన,ఏ.రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ యోగా శిక్షణ శిబిరాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగిందని ముగింపు సమావేశంలో పాల్గొన్న ముఖ్యఅతిథి శ్రీ చావా సత్యనారాయణ ప్రసాద్ పెండ్లి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు
కవితా కాలేజీ లో ముగిసిన యోగా వేసవి శిక్షణ శిబిరం
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

