Tuesday, June 2, 2026

క్షుద్ర పూజల పేరుతో 54 గ్రాముల బంగారం అపహరణ నిందితుడి అరెస్ట్, బంగారం రికవరీ, రిమాండ్‌కు తరలింపు.

- Advertisment -


చివ్వెంల పోలీస్ స్టేషన్ నందు కేసు వివరాలు వెల్లడించిన సూర్యాపేట  రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఎస్ఐ మహేష్.

నేటి వారధి న్యూస్ ప్రతినిధి
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లికి చెందిన పేర్ల చిరంజీవి వయస్సు: 48 సం. లు , వృత్తి: చెట్టు మూలికల అమ్మకం నివాసం దంతాలపల్లె గ్రామం మండలం మహబూబాబాద్ జిల్లా వృత్తిరీత్యా నాటు మందులు అమ్ముతుంటాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దైవ భక్తి గల ప్రజలను మోసం చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో కుడకుడ (స్నేహ నగర్) నివాసి లింగంపల్లి మమత కుటుంబంతో పరిచయం పెంచుకున్నాడు. వారి ఇంట్లో అనారోగ్య సమస్యలు, మరణాలు సంభవిస్తుండటంతో.. “మీ ఇంట్లో క్షుద్ర శక్తులు ఉన్నాయని, చేతబడి జరిగిందని” నమ్మించాడు. శాంతి పూజల పేరుతో, తేదీ 08.05.2026 న మమత ఇంటికి వెళ్లిన చిరంజీవి, పూజ చేస్తూ ఆమె మెడలోని పుస్తెల తాడుతో పాటు ఇంట్లోని చంద్రహారం, గోల్డ్ చైన్, బిళ్ళను తీసుకున్నాడు. వాటిపై చేతబడి ఉందని నమ్మించి, ఒక మట్టి గురుగిలో వేసినట్లు నటిస్తూ చాకచక్యంగా తన సంచిలోకి మార్చుకున్నాడు. ఆ గురుగిను 21 రోజుల వరకు తెరవకూడదని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. తరువాత వారికి అనుమానం వచ్చి అట్టి గురుగిని ఓపెన్ చేయడంతో అందులో బంగారం లేదు, లింగంపల్లి మమతా ఫిర్యాదు మేరకు చివ్వెంల ఎస్ఐ మహేశ్వర్ కేసు నమోదు చేసినారు. ఈ రోజు వాహనాల తనిఖీ లో భాగం గా నిందితుడు సూర్యాపేటలో ఆ బంగారాన్ని తాకట్టు పెట్టేందుకు హోండా షైన్ బైక్ (TS 05 FN 2199) పై వస్తుండగా, అయిలాపురం శివారులో పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన చిరంజీవిని పట్టుకుని తనిఖీ చేయగా, అతని వద్ద ఉన్న 54.198 గ్రాముల బంగారం బయటపడింది. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు.
నిందితుడిని అరెస్ట్ చేసి, 54 గ్రాముల బంగారం, బైక్, ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచించారు.ఇట్టి కేసు విచారణ CI G.రాజశేఖర్ గారి పర్యవేక్షణలో SI V. మహేశ్వర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -