Saturday, August 1, 2026

గిరిజన మహిళపై దాడి చేసిన వ్యక్తులను శిక్షించాలి. మాస్ లైన్ డిమాండ్.

- Advertisment -

నేటి వారధి న్యూస్ ప్రతినిధి
ఖమ్మం జిల్లా :వారం రోజుల క్రితం తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామానికి చెందిన పేరం రత్తమ్మ అనే గిరిజన (ఎరుకలి) మహిళను ఏ కారణం లేకుండా దాడి చేసి కుడి చేయి విరగ్గొట్టిన బోళ్ల సంధ్య, గణేష్, లలిత, లక్ష్మయ్య, కిరణ్, ఫుల్ గుజ్జు సుమంత్, భద్రమ్మలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ ( ప్రజాపంథా) రాష్ట్ర నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు. గుండమల రామయ్య. పాలేరు డివిజన్ కార్యదర్శి బందెల వెంకయ్య. ఏఐపీకేఎంఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధిత పేరం రత్తమ్మని పరామర్శించి ఖండించినారు. ఆమెకి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లతో మాట్లాడి ఆమెపై దాడి చేసిన పై వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకొని గిరిజన మహిళలకు భద్రత కల్పించాల్సిందిగా కోరారు. రత్తమ్మ భర్త హరినాథ్ సిపిఐ ఎంఎల్ (ప్రజాపంద) ఏర్పాటు చేయడంలో బీరోలు గ్రామంలో ఆనాటి నాయకులు దారమళ్ళ ముత్తయ్య, పేరం దశరథ, కోదండం. పట్టాభి. అమరులు పూసలి నారాయణ, సోమనబోయిన సోమయ్య లతో కలిసి దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కుటుంబంపై అకారణంగా దాడి చేయటానికి సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్రంగా ఖండిస్తూ ఆ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని వారు అన్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -