Saturday, August 1, 2026

ఘనంగా రామ్ ప్రసాద్ బిస్మిల్ జయంతి

- Advertisment -

నేటి వారధి న్యూస్ ప్రతినిధి, మంచిర్యాల జిల్లా
మందమర్రి పట్టణంలోని మాజీ ఆర్మీ జవాన్ ప్రస్తుత ఎస్ అండ్ పిసి ఉద్యోగి రాజేష్ పివ్హాల్, రాణి పివ్హాల్ దంపతులు గురువారం తన నివాసంలో రాంప్రసాద్ బిస్మిల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రను నేటి యువతకు తెలియజేయాలని, మహనీయుల జయంతి, వర్ధంతిలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాంప్రసాద్ బిస్మిల్ 1887 జూన్ 11న బ్రిటిష్ ఇండియాలో వాయావ్య సరిహద్దు ప్రావిన్స్ లోని షాజహాన్ పూర్ లో జన్మించారని, హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే విప్లవ సంస్థ వ్యవస్థాపక సభ్యుల్లో బిస్మిల్ ఒకరని అన్నారు. భగత్ సింగ్ అతనిని ఉర్దూ, హిందీ భాషల్లో గొప్ప కవిగా ప్రసంసించేవారని తెలిపారు. మణిపూర్ కుట్రలో 1925 కకోరి కుట్ర వంటి వాటిలో పాల్గొని, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడారని అన్నారు. స్వామి దయానంద సరస్వతి రాసిన సత్యార్థి ప్రకాష్ పుస్తకం స్ఫూర్తినివ్వగా అతను ఆర్య సమాధి సంస్థతో అనుబంధం కలిగి ఉండేవారని, 1927 డిసెంబర్ 19న బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి రాంప్రసాద్ బిస్మిల్ స్వతంత్ర సమరయోధుడు అయ్యారని, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖ విప్లవకారుడని, ఆయన బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడి అమరులయ్యారని,
ప్రాణత్యాగం చేసిన గొప్ప దేశభక్తుడని కొనియాడారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -