నేటి వారధి (ప్రతినిధి)
శ్రీకాకుళం జిల్లా.టెక్కలి పెద్ద బ్రాహ్మణ వీధిలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర భక్తిశ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ రథయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని “జై జగన్నాథ” నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.యువకులు ఉత్సాహంగా రథాన్ని లాగుతూ స్వామివారిపై తమ భక్తిని చాటుకున్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు సైతం పెద్దఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. రథయాత్ర సందర్భంగా భక్తుల సందడి, భజనలు, మంగళవాయిద్యాలు ఆకట్టుకున్నాయి.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టెక్కలి పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు రథయాత్ర మార్గమంతా పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించి కార్యక్రమం ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసేలా చర్యలు చేపట్టారు.భక్తుల విశేష పాల్గొనడంతో ఈ ఏడాది జగన్నాథ స్వామి రథయాత్ర టెక్కలిలో అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక ఉత్సాహంతో సాగింది.
ఘనంగా శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

