నేటి వారధి (ప్రతినిధి)
కరీంనగర్ జమ్మికుంట మండలం శాయంపేట గ్రామంలో బోయిని సమ్మయ్య ఆధ్వర్యంలో నూతన భారత్ పెట్రోల్ పంపు ఘనంగా ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా , ప్రొఫెసర్ ఖాసీం, ఆర్టీఐ కమిషనర్ భూపాల్, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు హాజరై పెట్రోల్ పంప్‌ను ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సేవా కేంద్రాలు ఏర్పాటు కావడం వల్ల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. బోయిని సమ్మయ్య మరిన్ని వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధించాలని.ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భారత్ పెట్రోల్ పంప్ ప్రారంభించిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు హాజరు
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

