Tuesday, June 2, 2026

మద్యం సేవించి వాహనం నడపుతూ పట్టుబడిన వాహనదారులకు శిక్ష జరిమానా విధించిన న్యాయస్థానం

- Advertisment -

నేటి వారధి న్యూస్ ప్రతినిధి
ఖమ్మం: ట్రాఫిక్ పోలీస్
మద్యం మత్తులో వాహనం నడుపుతున్న వారిలో ఒకరికి ఏడు రోజుల శిక్ష, 11 మందికి 10,100/- మరొకరికి 20,100/- రూపాయలు జరిమానా విధిస్తూ..నాలుగవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి బి.నాగలక్ష్మి తీర్పు చెప్పారు. జైలు శిక్ష పడిన వ్యక్తిని ఖమ్మం జైలు కి తరలించడం జరిగిందని ట్రాఫిక్ సీఐ బెల్లం సత్యనారాయణ తెలిపారు. ట్రాఫిక్ కోర్ట్ కానిస్టేబుల్ సతీష్ ను ఇన్స్పెక్టర్ అభినందించారు.మద్యం మత్తులో వాహనాలు నడిపితే తమతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుందన్నారు. భవిష్యత్తులో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి రహదారి భద్రతకు సహకరించాలని పోలీసులు కోరారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -