Wednesday, September 30, 2026

మానుకోట రైలు పట్టాలపై ఓ ప్రాణం పోబోతుంది సమాచారం అందిన వెంటనే శరవేగంగా స్పందించిన మహబూబాబాద్ రూరల్ సిఐ అంజలి..

- Advertisment -

నేటి వారధి (ప్రతినిధి)
మహబూబాబాద్ జిల్లా పరిధిలో కటికి చీకటి ఓ..పక్క. పట్టాలపై పరుగులు పెడుతూ వస్తున్న రైలుబండి మరోపక్క ఖచ్చితంగా చావాలని నిర్ణయించుకుని  రైలు పట్టాలపై పడుకున్న యువకుడి జాడ కోసం కాలం కంటే వేగంగా పరుగులు పెట్టిన సిఐ అంజలి, పోలీస్ సిబ్బంది.
క్షణం…! క్షణం…!! చావు.. బ్రతుకు.. దోబూచులాడిన ఉత్కంఠభరిత సంఘటన..
ఎట్టకేలకు నిండు ప్రాణాన్ని కాపాడిన మానుకోట పోలీస్ లు మహబూబాబాద్ పరిధిలో రైల్వే ట్రాక్ పై ఓ..యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి రైలు పట్టాలపై పడుకుని ఉన్నాడనే సమాచారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో  నైట్ అలర్టింగ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలి కి తెల్లవారుజామున (ఈరోజు బుధవారం) సుమారు 2.44 గంటలకు డిజి కంట్రోల్ రూమ్ నుంచి అత్యవసర సమాచారం అందింది.
తెల్లవారుజామున 2.44గంటల సమయం  ప్రపంచమంతా  ఆదమరచి నిదురపోతున్న సమయం. ఎటుచూసినా కటిక చీకటి.కానీ.వంటిపై ఉన్న ఖాకీ డ్రెస్ తన బాధ్యతను గుర్తుచేసింది. శరవేగంగా స్పందించిన మహబూబాబాద్ రూరల్ సిఐ అంజలి వైర్ లెస్ సహాయంతో తన సిబ్బందిని అప్రమత్తం చేసింది.నిమిషం ఆలస్యం అయితే ఓ.. నిండు ప్రాణం రైలుబండి చక్రాల క్రిందపడి ముక్కలు.., ముక్కలు అవుతుంది కాలంతో పోటీపడి ప్రాణాన్ని కాపాడాల్సిన అత్యంత విలువైన క్షణాలు
సిఐ అంజలి అప్రమత్తం చేయడంతో  ఆమెతోపాటు ఎస్సై సుదర్శన్, బ్లూ కోల్ట్స్ సిబ్బంది, ఇతర పోలీసు సిబ్బంది  ఏమాత్రం ఏమరుపాటు లేకుండా రైలుపట్టాల వద్దకు చేరుకున్నారు.యువకుడి ఆచూకి కోసం ఆ..చీకటిలోనే పట్టాల వెంట పరుగులు పెట్టారు‌.
రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు.
కానీ.. ఆచూకి అంత తేలికగా దొరకలేదు…, పట్టాలపై ఆ..యువకుడు  పడుకొని ఉండడంతో.., చీకటిలో కనిపించలేదు..
అయినా..పోలీస్ ల వెదుకులాట కొనసాగుతూనే ఉందే అంతలో మరో ప్రమాదం
మణుగూరు ఎక్స్ ప్రెస్ పరుగులు పెడుతూ తమవైపే వస్తుంది ఏం..చేయాలో పాలుపోని పరిస్థితి అయినా సంకల్పం వీడని వెదుకులాట ఒక పక్క దూసుకొస్తున్న రైలు మరోపక్క వెదుకులాట ఆశలు ఆవిరవుతున్న ఆఖరి క్షణాల్లో ఆ..యువకుని ఆచూకి రైలుపట్టాలపై కనిపించింది
ఆ..ప్రాణాన్ని కాపాడాలి. కానీ రైలు సమీపిస్తున్న ఆ..సమయంలో ఏ..మాత్రం అటు..ఇటు అయినా తమ ప్రాణాలకే ప్రమాదం. ఆలోచించుకునే సమయం కూడా వారు తీసుకోలేదు. రూరల్ ఎస్ఐ అంజలి, తన సిబ్బంది సహాయంతో మెరుపు వేగంతో స్పందించారు.. పరుగులు పెడుతూ వస్తున్న రైలు కింద ముక్కలై పోవాల్సిన ఓ.. ప్రాణాన్ని.., తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా కాపాడి.., మానుకోట పోలీస్..శహభాష్ అనిపించారు..
పోలీస్ శాఖ అప్రమత్తతతో రక్షించబడిన ఆ…యువకుడు  షేక్ వసీమ్ (26), తండ్రి అబ్బాస్ , నివాసం: ఇల్లందుగా గుర్తించారు.
అనంతరం అతడిని మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి కౌన్సెలింగ్ నిర్వహించారు.  అతని తల్లిదండ్రులకు సమాచారం అందించి, వారికి అప్పగించారు.
ఈ ఉత్కంఠభరిత ఘటనలోమహబూబాబాద్ రూరల్ సీఐ అంజలి, ఎస్సై సుదర్శన్, బ్లూ కోల్ట్స్ సిబ్బంది, ఇతర పోలీస్ సిబ్బంది చూపిన సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలు, సేవాతత్పరత.. ఓ…నిండు ప్రాణాన్ని కాపాడి పోలీసు శాఖపై ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంచాయని
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ వారిని ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -