Saturday, August 1, 2026

ముద్రగడ పద్మనాభం సేవలు చిరస్మరణీయం మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్

- Advertisment -

ముద్రగడ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

నేటి వారధి (ప్రతినిధి)
శ్రీకాకుళం జిల్లా.నరసన్నపేట నిరుపేదలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి, హక్కుల సాధనకు ముద్రగడ పద్మనాభం చేసిన పోరాటాలు, అందించిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయి” అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కొనియాడారు. నరసన్నపేట నియోజకవర్గ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభం ప్రజా హృదయాల్లో చెరపరాని ముద్ర వేసుకున్నారని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ నివాళులర్పించే కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ శ్రేణులు మరియు ముద్రగడ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రద్ధ అంజలి ఘటించారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -