Saturday, August 1, 2026

వర్షాకాలంలో వచ్చే సీజనల్ జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

- Advertisment -


సర్పంచ్ సెక్రెటరీ ఆధ్వర్యంలో
అవగాహన సదస్సు

నేటి వారధి న్యూస్ ప్రతినిధి
ఖమ్మం జిల్లా రూరల్ మండలం మంగళగూడెం గ్రామ
ప్రజల ఆరోగ్యం మన అందరి బాధ్యత. వర్షాకాలం ఎంతో హాయినిచ్చినప్పటికీ, ఈ సీజన్‌లోనే మనకు తెలియకుండానే రకరకాల జ్వరాలు, వ్యాధులు ముంచుకొస్తాయి. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికున్‌గున్యా మరియు వైరల్ జ్వరాలు ఈ సమయంలోనే ఎక్కువగా ప్రబలుతాయి.
​వీటన్నింటికీ ప్రధాన కారణం మన చుట్టూ ఉండే అపరిశుభ్రత మరియు దోమలు.వ్యాధి వచ్చాక బాధపడటం కంటే, రాకముందే నివారించడం ఉత్తమం కాబట్టి మన ఇళ్లతో పాటు మన వీధులను కూడా శుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత.
​పంచాయతీ తరఫున మనం ఇప్పటికే మురుగు కాలువల శుభ్రత, బ్లీచింగ్ పౌడర్ చల్లించడం, ఫాగింగ్ (పొగ పెట్టించడం) వంటి చర్యలు చేపడుతున్నం ఎవరికైనా జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి డాక్టర్‌ను సంప్రదించాలి.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేకల సత్యనారాయణ సెక్రెటరీ మనీ వివో లు ఆశ వర్కర్లు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -