Saturday, August 1, 2026

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై పవన్ కళ్యాణ్  దిగ్భ్రాంతి

- Advertisment -

నేటి వారధి న్యూస్ ప్రతినిధి
విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ లో చోటు చేసుకున్న ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ దిగ్ర్భాంతికి లోనయ్యారు. ప్రమాదం గురించి తెలిసిన విశాఖ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. స్టీల్ ప్లాంట్ లో చేపట్టిన సహాయ చర్యలపై ఆరా తీశారు. అధికారులంతా సమన్వయంతో సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని దిశా నిర్దేశం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ ఈరోజు విశాఖ చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -